బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పూల మాల వేసి నివాళులర్పించారు. దూరదృష్టితో, దీర్ఘకాలిక ప్రణాళికా రచనలతో పని చేసిన తిరుగులేని నాయకుడని కొనియాడారు.
భారత పార్లమెంటులో 40ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించిన దళిత నాయకుడని పేర్కొన్నారు. అంటరానితనం నిర్మూలించడానికి కృషి చేసిన వారిలో ప్రముఖుడని ప్రశంసించారు. దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాధించిన వ్యక్తి బాబూజీ అని.. చిన్నతనం నుంచే కులవివక్షను రూపుమాపేందుకు కృషి చేశారని అన్నారు.
ఇదీ చదవండి: