ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై అకట్టుకుంటున్న కేరళ వాద్యం

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాంప్రదాయ బద్దంగా, అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది... నవరాత్రులు ఆద్యంతం అమ్మవారి ఆలయంలో డప్పుల హోరుతో మారుమోగింది.... ప్రసిద్ద ఆలయంలో తమకు అవకాశం కలగడం అదృష్టమని కేరళ సంగీత విద్వాంసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

author img

By

Published : Oct 24, 2020, 7:22 PM IST

ఇంద్రకీలాద్రిపై అకట్టుకుంటున్న కేరళ వాద్యం
ఇంద్రకీలాద్రిపై అకట్టుకుంటున్న కేరళ వాద్యం
ఇంద్రకీలాద్రిపై అకట్టుకుంటున్న కేరళ వాద్యం

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శవన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 17న నవరాత్రులు ప్రారంభమైన నాటి నుంచి అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. పలు ప్రాంతాల నుంచి భవానీ దీక్షాపరులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

అమ్మవారి నిత్య పూజలు ,ఊరెేగింపులు ప్రత్యేకంగా ఉంటాయి. మేళ తాళాలతో అమ్మవారు ఊరేగింపు సహా పూజల్లో పాల్గొనడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. మంగళ వాయిద్యాలు మాత్రమే ఉంటుండగా.. ఈసారి కేరళ సాంప్రదాయ వాద్యమైన సింగరి మేళాన్ని కూడా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.. ఈసారి ఉత్సవాల్లో కేరళ సాంప్రదాయ సింగరి మేళతాళాల ప్రదర్శన ఇక్కడకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజూ మంగళ వాయిద్యాలతో పాటు సింగిరి మేళం ధ్వనులతో ఆలయం పరిసర ప్రాంతాలు మారు మోగుతున్నాయి. ఈ వాయిద్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు.

కేరళ సాంప్రదాయ ప్రత్యేకతలు..
కేరళ సాంప్రదాయ వాద్యం ప్రదర్శనలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. 12 మంది వాద్యకారులతో కూడిన బృందం మూడు వరుసల్లో నిల్చొని లయబద్దంగా వాయిస్తారు. వాయిద్యా కారులు పంచె కట్టులో మాత్రమే కనిపిస్తారు. మధ్యలో పలు రకాల నృత్యం, అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంటోంది. దుర్గ గుడి రాజగోపురం ముందు వీరు చేస్తోన్న ప్రదర్శనను దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులు కాసేపు నిలబడి తిలకిస్తున్నారు. వీటిని తమ సెల్ ఫోన్లలో బంధిస్తున్నారు.

2016లో తొలిసారిగా...

2016లో విజయవాడలో జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కేరళ సాంప్రదాయ వాద్యాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. అంతకుముందు గోదావరి పుష్కర సమయంలో పలు దేవాలయాల వద్ద వీరి ప్రదర్శనను చూసి.. ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో కొలువు చేసేందుకు అప్పటి దుర్గ గుడి ఈవో సూర్యకుమారి వీరికి అవకాశం కల్పించారు. అమ్మవారి శరన్నవరాత్రులు, ఉత్సవాల సమయంలో ఏటా వీరు సందడి చేసేవారు. తర్వాత వివిధ కారణాలతో మధ్యలో కొన్నేళ్లు వీరికి అవకాశం రాలేదు. ఈ సారి దసరా శరన్నవరాత్రులకు దుర్గగుడి ఆలయ అధికారులు కేరళ వాద్య కళాకారులకు దుర్గ గుడి ఆలయ అధికారులు వీరికి మళ్లీ అవకాశం కల్పించారు.

తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ వేకువజామున 5గంటల నుంచి రాత్రి పూజలు ముగిసేవరకు వీరి అభినయంతో కూడిన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అమ్మవారి పల్లకీ సేవలు, ఊరేగింపు , సహా నిత్య పూజల్లో మేళతాళాలు ప్రత్యేక శోభను తీసుకు వస్తున్నాయి. వినసొంపుగా, లయబద్దంగా, ఒళ్లు గగుర్పోడిచేలా వీరు చేసే వాద్యానికి పలువురు భక్తులకు అమ్మవారు పూనకం వస్తుండటం విశేషం. దీంతో భక్తులు కూడా నృత్యం చేస్తున్నారు. దుర్గమ్మ సన్నిధిలో కొలువు చేసేందుకు తమకు అవకాశం కల్పించడంపై కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

సరిహద్దుల వరకు రండి.. గ్రామాల్లోకి తీసుకెళ్తాం: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.