కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం తిరుమలగిరికి చెందిన సుమారు 20 మంది దళిత రైతులు గడిచిన 80 ఏళ్లుగా గ్రామ సమీపంలో నీ 2.80 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను బలవంతంగా తీసుకున్నారని వాపోయారు. భూమిలో కంది పంట సాగు చేయగా పంటంతా ఒక చోట కుప్పపోసి ఉన్న తరుణంలో రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా వచ్చి హడావుడి చేసి పొలంలో ఉన్న పంటను ట్రాక్టర్లతో బలవంతంగా ఇళ్లకు తరలించారని అన్నారు. పూర్వకాలంగా భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు భూమి లేకపోతే ఎలా బతికేది అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో పలుచోట్ల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కొందరి ప్రోద్బలంతో కావాలని తమ భూమిని తీసుకున్నారని వారు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా తమ బాధను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నారు .
'భూమి లేకపోతే బతికేదెలా?' - భూములు కోల్పోతున్న దళితుల ఆవేదన
ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ కొందరు పేదల జీవితాల్లో ఆందోళన కలిగిస్తోంది. జగ్గయ్యపేట మండలం తిరుమలగిరికి చెందిన దళిత రైతులు తమ భూములను ప్రభుత్వం అధికారులు స్వాధీనం చేసుకున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని వాపోయారు.
!['భూమి లేకపోతే బతికేదెలా?' dalits-worry-about-losing-land](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6140473-457-6140473-1582206345519.jpg?imwidth=3840)
కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం తిరుమలగిరికి చెందిన సుమారు 20 మంది దళిత రైతులు గడిచిన 80 ఏళ్లుగా గ్రామ సమీపంలో నీ 2.80 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను బలవంతంగా తీసుకున్నారని వాపోయారు. భూమిలో కంది పంట సాగు చేయగా పంటంతా ఒక చోట కుప్పపోసి ఉన్న తరుణంలో రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా వచ్చి హడావుడి చేసి పొలంలో ఉన్న పంటను ట్రాక్టర్లతో బలవంతంగా ఇళ్లకు తరలించారని అన్నారు. పూర్వకాలంగా భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమకు భూమి లేకపోతే ఎలా బతికేది అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో పలుచోట్ల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కొందరి ప్రోద్బలంతో కావాలని తమ భూమిని తీసుకున్నారని వారు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా తమ బాధను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నారు .
ఇదీ చూడండి:'అవినీతి నిరూపిస్తే విషం తాగుతా'