ETV Bharat / state

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

author img

By

Published : Aug 4, 2019, 11:01 AM IST

బంగాళాఖాతం
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వీటికి తోడుగా రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. తెలుగురాష్ట్రాలతో పాటు... ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా లోనూ రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు సూచిస్తున్నాయి. శబరి, గోదావరి, ఇంద్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. నదుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. విశాఖ , విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని సూచించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది.

ఇదీ చదవండి.

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో శనివారం రెవెన్యూ అధికారులతో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏ కృష్ణారావు సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పైలెట్ ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని తెలిపారు ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో లో అన్ని గ్రామాల్లో లో పంచాయతీ ఆధ్వర్యంలో రేషన్ వస్తువులు ఇంటింటికి పంపిణీ చేస్తామని తెలిపారు ప్రతి మండలంలోని రేషన్ సరుకులు ఎం ఎల్ ఎస్ పాయింట్ తరలించి అక్కడినుంచి వాహనాల ద్వారా రేషన్ డిపో తరలిస్తామని అక్కడినుంచి క్లస్టర్ కు తరలించి అక్కడినుంచి వాలంటీర్లు ద్వారా ఇంటింటికి రేషన్ అందిస్తామని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో 2015 రేషన్ షాప్ ఉన్నాయని 13840 క్లస్టర్ ఏర్పాటు చేశామని అన్నారు ఒకటో తారీకు నుంచి పంచాయతీ ద్వారా పథకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డీఎస్ఓ నాగేశ్వరరావు తహసీల్దార్ రాంబాబు తో పాటు అధికారులు రేషన్ డీలర్లు ఉన్నారు.8008574248.Body:తాసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో డీలర్ తో సమావేశంConclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.