లాటరీ పేరుతో ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసిన సైబర్ నిందితుడి నుంచి... పోలీసులు 40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ గుణదలకు చెందిన బాలాజీ అనే వ్యక్తికి స్నాప్‌డీల్‌లో కోటి రూపాయల లాటరీ తగిలిందని ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. అతను వారికి ఫోన్ చేసి మాట్లాడగా... అతనిని నమ్మించేందుకు నకిలీ ఐడీ, పాన్ కార్డును పంపించారు. వాటిని చూసిన భాదితుడు విడతల వారీగా నిందితుల ఖాతాలో 40వేల నగదు జమచేశాడు.
ఐటీ, జీఎస్టీ పేరుతో నగదు అడగడంతో... అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బ్యాంకు ఖాతా ఆధారంగా నిందితులను గుర్తించారు. బ్యాంకు అధికారులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి నిందితుడి ఖాతాను సీజ్ చేశారు. 40 వేల నగదును స్వాధీనం చేసుకొని... ఆ చెక్‌ను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు బాధితునికి అందజేశాడు. లాటరీ పేరుతో నగదు వచ్చిందని చెబితే నమ్మవద్దని పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి...పాపం.. ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో!