ETV Bharat / state

యూట్యూబ్​లో చూసి.. నేరాలు నేర్చుకుంటున్నారు! - కృష్ణా జిల్లా నేర వార్తలు

వ్యసనాలకు బానిసలయ్యారు. సులువుగా సంపాదించేందుకు అడ్డదారులు తొక్కారు. వరుస హత్యలు, దోపిడీలకు పాల్పడి చివరకు కటకటాలపాలయ్యారు. ఇప్పటివరకూ వారు చేసిన నేరాల కూపీ లాగే పనిలో పోలీసులు ఉన్నారు. వృద్ధ దంపతుల హత్య కేసులో నిందితులైన కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ముఠా నేర ప్రస్థానమిది.

crime gang arrested in krishna district
crime gang arrested in krishna district
author img

By

Published : Jun 20, 2021, 10:53 AM IST

కంచికచర్లకు చెందిన ముగ్గురు నిందితులు.. పోరంకికి వచ్చి మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గతేడాది అక్టోబర్‌ నుంచి వరుస నేరాలకు పాల్పడుతున్నారు. ముఠాలోని ఇద్దరు యూట్యూబ్ వీడియోల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని నేరాలు చేసేవారని సమాచారం. పగటిపూట ఏదో ఒక పనిచేసుకుంటూ రెక్కీ నిర్వహించి రాత్రుళ్లు నేరాలు చేసేవారు. పెద్దమొత్తంలో డబ్బు కొట్టేయాలన్న ప్రణాళికతో పోరంకిలోని ఓ ఏటీఎం దోపిడీకి పథకం రచించినా అది విఫలమైంది.

బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పెనమలూరు పోలీసులు.. తొలుత ఓ అనుమానితుడిని పట్టుకున్నారు. అతడు దోపిడీ ప్రయత్నాన్ని అంగీకరించి గతంలో చేసిన నేరాలు, ప్రమేయమున్నవారి వివరాలు చెప్పాడు. దీని ఆధారంగా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పెనమూలురు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ముఠా నాలుగు హత్యలు చేసినా సాధారణ మరణాలుగానే భావించి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విచారణలో నిందితులు చెబుతున్న వివరాల ఆధారంగా హత్యలు చేసిన ప్రాంతాలకు వెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారు.

తాడిగడప, పోరంకి, విష్ణుపురం, పద్మనాభ కాలనీల్లో ఒంటరిగా ఉండే వృద్ధులను హత్య చేసి బంగారు నగలను ఈ ముఠా దోచుకెళ్లింది. ఎక్కడా మారణాయుధాలు ఉపయోగించని తీరుతో ఎవరూ హత్యగా అనుమానించలేదు. తాడిగడపలో ఓ ఇంట్లో దోపిడీ కేసుగా మాత్రమే నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో రెండు ఇళ్లకు రెక్కీ నిర్వహించినా పరిస్థితులు అనుకూలించక వెనక్కి తగ్గారు. మంగళగిరిలో కొన్ని గొలుసుల దొంగతనాలకు పాల్పడ్డారు.

నిందితుల అరెస్ట్ మరికొన్ని రోజులు ఆలస్యమైతే మరికొన్ని దారుణాలు జరిగి ఉండేవని సమాచారం. ఈ వారం మంగళగిరి, తెనాలి, కృష్ణా జిల్లా అవనిగడ్డలో మూడు హత్యలకు పథకం రచించినట్టు తెలుస్తోంది. ఇందుకు రెక్కీ సైతం పూర్తైంది. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లనే ఎంచుకున్నట్టు.. పెనమలూరు పోలీసుల విచారణలో ముఠా సభ్యులు వెల్లడించారని సమాచారం. కంచికచర్లలో గతేడాది డిసెంబర్‌లో వృద్ధ దంపతుల హత్య, బంగారం దోపిడీ వీళ్లు చేసిన పనేనని విచారణలో అంగీకరించారు.

ఇదీ చదవండి:

Vaccination Sunday: నేడు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.