కృష్ణా జిల్లాలో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు వివరించారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాపై పోలీసులకు సమాచారమందటంతో అపార్ట్ మెంట్లో పోలీసులు దాడులు చేశారు. 25 సెల్ ఫోన్లు ,ల్యాప్ ట్యాప్ ,టీవీ లతో పాటు కొన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ కుమార్ ,శ్రీనివాస్ , వెంకట నాగ శివప్రసాద్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కీలక నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. నిందితులకు క్రికెట్ బుకీలకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: కేంద్రమంత్రి హర్సిమ్రత్ రాజీనామా.. కారణమిదే?