ETV Bharat / state

CRADLE CEREMONY: గోమాతపై మమకారం.. లేగదూడకి బారసాల - మచిలీపట్నం వార్తలు

ఇంట్లో పుట్టిన నవజాత శిశువులకు బారసాల చేయడం ఆనాదిగా వస్తున్న ఆచారం..కానీ ఎప్పుడైనా ఆవు లేగదూడకి బారసాల చేయడం మీరు చూశారా.. కొద్దిగా వింతగా అనిపించిన ఇది నిజం..కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైథిలి అనే మహిళ లేగదూడకి బారసాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

cradle-ceremony
cradle-ceremony
author img

By

Published : Aug 3, 2021, 11:45 AM IST

మూగజీవాలపై కొంతమంది అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. వాటిని ఇంట్లో కుటుంబసభ్యులుగా ఆదరిస్తుంటారు. తాము తిన్నా, తినకపోయినా.. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటూ.. సమయానికి సేవలు చేస్తుంటారు. మరికొంతమంది అయితే.. వాటికి శుభకార్యాలు నిర్వహిస్తూ తమ ప్రేమను చాటుకుంటారు. ఇలాంటి ప్రేమనే చాటుకుంది ఓ కుటుంబం. లేగదూడకు బారసాల నిర్వహించి గోమాతపై ఉన్న మమకారాన్ని చూపెట్టారు.

లేగదూడకి బారసాల...

మచిలీపట్నం డాబాల సెంటర్‌కు చెందిన మైథిలి ఇంట్లో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు.. దూడకు జన్మనిచ్చింది. నెలలోపు నవజాతి శిశువులకు ఉయ్యాల వేడుక నిర్వహించే విధంగా..ఈ లేగ దూడకు సైతం కుటుంబ సభ్యులు ఘనంగా ఉయ్యాల వేడుక నిర్వహించారు. చుట్టుపక్కల వారిని పిలిచి వైభవంగా వేడుక చేశారు. ఆవుకు సైతం ఏడో నెలలో శ్రీమంతం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. లేగదూడకు సీతగా నామకరణం చేశారు.

ఈ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల వారు భారీగా తరలివచ్చారు. మూగజీవాల పట్ల వారు ప్రదర్శిస్తున్న ప్రేమను చూసి ముగ్ధులయ్యారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.