కృష్ణా జిల్లా విజయవాడలో సీపీఎం పార్టీ ప్రజా చైతన్యయాత్ర 6వ రోజు కొనసాగింది. వైకాపా, తెదేపా ఎంపీలు భాజపాకు అనుకూలంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపుచేయడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరోనాను కట్టడి చేయడంలో ,ఉపాధి కల్పించడంలో విఫలమైందని అన్నారు. విద్యుత్ బిల్లులు,ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. ప్రమాణాలు పాటించని కళాశాలల్లో ప్రవేశాలు రద్దు