రాజధాని అమరావతి విషయంలో కోర్టులో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్లు చేసినట్లు ఉందని సీపీఎం నేత బాబురావు ఆరోపించారు. అమరావతి రైతు, కూలీలను, ప్రజలను భాజాపా మోసగిస్తోందన్నారు. రాష్ట్రంలో భాజాపా, జనసేన అధికార మిత్రపక్షంగా ఉండగా, వైకాపా, తెదేపాలు అనధికార మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నాయని మండిపడ్డారు. విజయవాడలో భాజాపా మోసం, ద్రోహంపై సీపీఎం ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి. 'ప్రభుత్వం ఇచ్చే డబ్బు.. మహిళల జీవితాన్ని మార్చేందుకే'