పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. పోలవరం నిర్వాసితులకు ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. 2006-07 సంవత్సరంలో ఎకరాకు లక్షా 15 వేలు తీసుకున్న వారికి.. ఎకరాకు 5 లక్షలు ఇవ్వాలన్నారు. నిర్వాసిత కుటుంబాలను తరలించే నాటికి, కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, పూర్తి పరిహారం ఇచ్చిన తర్వాతనే తరలించాలన్నారు. మిగులు భూములను సర్వే చేసి నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: సీపీఐ - పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. 2006-07 సంవత్సరంలో ఎకరాకు లక్షా 15 వేలు తీసుకున్న వారికి.. ఎకరాకు 5 లక్షలు ఇవ్వాలన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలన్నారు.