కృష్ణా జిల్లా విజయవాడంలోని దేవినేని గాంధీపురంలో 40 సంవత్సరాలుగా నివాసముంటున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పేర్కొంటూ... పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు, డ్రైనేజీ ఛార్జీలు చెల్లిస్తూ... అనేక మౌలిక సదుపాయాలు సాధించుకున్న ఆ కుటుంబాలను అక్కడి నుంచి తరలించడం సరైంది కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబూరావు అన్నారు. ఇళ్లను తొలగించొద్దని, పట్టాలు ఇవ్వాలని కోరినందుకు పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు.
గతంలో తెదేపా, ప్రస్తుతం వైకాపా ప్రభుత్వాలు స్థానికులకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నామని ఒక్కొక్కరి నుంచి రూ. 550 వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు పట్టాలు ఇవ్వకపోగా శనివారం అకస్మాత్తుగా ఇళ్లను ఖాళీ చేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. పట్టాల ఇస్తామన్న హామీతో గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే తన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రాంతవాసుల తరఫున అందోళన చేపడతామన్నారు.