టిడ్కో గృహాల నిర్మాణం పూర్తైనా లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. టిడ్కో గృహాల విషయంలో ప్రభుత్వం పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తప్పని పరిస్థితుల్లో సీపీఐ ఇళ్లను ఆక్రమించుకునేందుకు పిలుపు నిచ్చిందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ పెట్టి సీపీఐ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం తగదని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహాలను లబ్ధిదారులకు ఇవ్వడం ఎందుకు ఆలస్యం అవుతుందో ప్రజలకు చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఇంకా విజృంభిస్తుందే తప్ప తగ్గదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ పంతాలకు పోకుండా అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో చర్చించి ఇళ్ల సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: