ETV Bharat / state

' ఆనందయ్య ఆయుర్వేద మందుపై అనవసరంగా వివాదం చేస్తున్నారు' - ఆనందయ్య ఆయుర్వేద మందు తాజా వార్తలు

30 ఏళ్లుగా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడని ..ఆయన మందుపట్ల అపోహలు సృష్టించొద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆనందయ్యను యథావిధిగా తనపని తనను చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

Breaking News
author img

By

Published : May 28, 2021, 6:40 PM IST

ఆనందయ్య ఆయుర్వేద మందుపై అనవసరంగా వివాదం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. 30ఏళ్లుగా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని తెలిపారు. నెల్లూరుకు చెందిన ఒక మంత్రి ఆనందయ్యతో కొవిడ్‌ మందులు తయారు చేసి దిల్లీ, ఇతర ప్రాంతాలకు పంపినట్లు సమాచారం ఉందన్నారు. ఆయుర్వేద వైద్యులు ఆనందయ్యను యథావిధిగా తనపని తనను చేసుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వైద్యం వికటించిందని అపోహాలు సృష్టించి కార్పోరేట్‌ సంస్థలకు ఊడిగం చేసే వికృత చర్యలకు పాల్పడవద్ధని హెచ్చరించారు.

ఇదీ చూడండి. యువకుడి దారుణ హత్య.. ముక్కలుగా నరికి చంపాడు.. కుమార్తెను ప్రేమించాడనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.