75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. విజయవాడ దాసరి భవన్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్లతో కాకుండా పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా ఎగరవేయించటం సరికాదన్నారు. సర్పంచుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం ఆదేశాలిస్తోందని ఆక్షేపించారు. నిధులు, విధులు, అధికారాల విషయంలో చట్ట వ్యతిరేక జీవోలను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: