కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతున్న ఇంధన ధరలకు నిరసనగా విజయవాడలోని ధర్నాచౌక్‌లో సీపీఐ, సీపీఎం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయాలని పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలపై పెను భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.
కోవిడ్‌తో పేద ప్రజలు అల్లాడుతుంటే ఇంధన ధరలతో మోయలేని భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ధర్నాచౌక్ కూడలికి భారీ ఎత్తున సీపీఐ సీపీఎం నాయకులు రావడంతో అనుమతి లేదని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులకు కార్యకర్తలకు తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. బలవంతపు అరెస్టులు చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు.
ఇదీ చదవండి: