ఏపీ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం తెలిపారు. భాజపా అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని... ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్కున్న ప్రత్యేక హక్కును రద్దు చేశారని రామకృష్ణ ఆరోపించారు. వైకాపా ఎంపీలు పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు పలికినా... రాష్ట్రంలో మాత్రం అమలు చేయబోమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తక్షణమే ఎన్.ఆర్.సిని అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి..