'ఆంధ్రా బ్యాంకును కాపాడుకుందాం, బ్యాంకుల విలీనకరణను అడ్డుకుందాం' అనే అంశంపై విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని సీపీఐ నేత దోనేపూడి శంకర్ తెలిపారు. 97 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంకును, యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం విచారకరమని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైన ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. 3 వేల శాఖలతో దేశ, విదేశాల్లోనూ సేవలు అందిస్తోన్న ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడం కేవలం కార్పొరేట్, పారిశ్రామిక వర్గాలకు ఊడిగం చేయడమేనని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క తెలుగువారు ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని అడ్డుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
ఆంధ్రబ్యాంకు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అఖిలపక్షం