విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందారని సీపీ శ్రీనివాసులు తెలిపారు. వేర్వేరు ఆస్పత్రులకు 18 మందిని తరలించినట్లు వెల్లడించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ శ్రీనివాసులు తెలిపారు. అగ్నిమాపక, విద్యుత్ శాఖల నుంచి సమాచారం తీసుకుంటున్నామని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు. ఎవరి నిర్లక్ష్యమనేది విచారణ అనంతరం ప్రకటిస్తామని సీపీ అన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11కుచేరిన మృతుల సంఖ్య