ETV Bharat / state

కొనుగోలులో జాప్యం.. వర్షానికి తడిసిన పత్తి - నందిగామ మార్కెట్ యార్ట్ స్టోరీ

కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేటలో కురిసిన వర్షాలకు నందిగామ, కంచికచర్ల మార్కెట్ యార్డుల్లో ఉన్న పత్తి తడిసింది. 4 రోజుల క్రితం పత్తిని యార్డుకు తీసుకొచ్చినా.. కొనుగోలులో జాప్యం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా పత్తి బోరాలు తడిశాయని ఆవేదన చెందారు.

Cotton soaked in rain in Nandigama market yard
నందిగామ మార్కెట్ యార్డులో వర్షంలో ముద్దైన పత్తి
author img

By

Published : Nov 26, 2020, 1:30 PM IST

నివర్ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నందిగామ, కంచికచర్ల మార్కెట్ యార్డు​లో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పత్తి బోరాలు వర్షానికి తడిసిపోయాయి. నాలుగు రోజుల క్రితం పత్తి పంటను యార్డుకు తీసుకురాగా.. కొనుగోలుదారులు జాప్యం చేశాడు. వెయ్యి భోరాలు పత్తి కొనుగోలుకు తీసుకురాగా.. నిన్న ధర నిర్ణయించారు. బస్తాలు ఇంకా తూకాలు వేయలేదు. యార్డు ఆవరణలోనే పత్తి వర్షానికి తడిసిపోయింది. ఈ కారణంగా.. పత్తి రైతులు ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు.. రెండు నియోజకవర్గాల పరిధిలో కోతకొచ్చిన వరి పైర్లు దెబ్బతిన్నాయి. 80 వేల ఎకరాల్లో సాగు అయిన పత్తి పంట.. వర్షానికి దాదాపుగా తడిసిపోయింది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా పత్తి, మిర్చి పైర్లు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ తపాను ప్రభావం చూపుతుండగా.. ఆర్థికంగా మరింత కుదేలవుతున్నారు.

ఇదీ చదవండి:

వర్షాలు తగ్గగానే వరద నష్టంపై మదింపు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.