ETV Bharat / state

యార్డుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేత... దళారుల వైపు రైతుల చూపు

కృష్ణా జిల్లాలోని పత్తి రైతులను కష్టాలు చుట్టు ముట్టాయి. పండించిన పంట చేతికందకుండా వర్షాలు చేటుతెచ్చాయి. మద్దతు ధరకు పంటను విక్రయించుకునేందుకు భారత పత్తి సంస్థ నిబంధనలు అడ్డొచ్చాయి. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ తాము సూచించిన జిన్నింగ్‌ మిల్లుకు రైతులు సొంత రవాణా ఖర్చుతో తెస్తేనే కొంటామని సీసీఐ ఆంక్షలు విధించింది. ఇక స్థానిక వ్యాపారులు సీసీఐ నిబంధనలు సాకుగా చూపి తాము కోరిన ధరకు ఇస్తేనే కొంటామని అంటున్నారు. గతంలో మాదిరిగా మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయకుండా జిన్నింగ్‌ మిల్లుకు తీసుకురావాలంటూ ప్రభుత్వ ఆదేశాలు తెల్లబంగారం పండించిన కర్షకులకు పెనుభారంగా మారాయి.

cotton yard
కొనుగోళ్లు నిలిచిపోయి యార్డుల్లో ఉండిపోయిన పత్తి
author img

By

Published : Dec 3, 2020, 1:33 PM IST

కృష్ణా జిల్లాలో ఏటా మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల మార్కెట్‌ యార్డుల పరిధిలో సీసీఐ కేంద్రాలు ప్రారంభించి పత్తిని కొనుగోలు చేసేవారు. ఏటా ఈ కేంద్రాల ద్వారా ఏడెనిమిది లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తుండగా మరో ఐదారు లక్షల క్వింటాళ్ల పత్తిని ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది సీసీఐ అమలు చేసిన నిబంధనలు పత్తి రైతుకు ప్రతిబంధకమయ్యాయి. ఫలితంగా తాము పండించిన పంటను దళారులకు విక్రయించుకోవడమే ప్రత్యామ్నాయమైంది. గతంలో యార్డుల్లో కేంద్రాలు ఉండగా ఈ ఏడాది నుంచి తాము ఎంపిక చేసిన జిన్నింగు మిల్లులకు దూదిని తీసుకురావాలని సూచించింది.

కేంద్రం అమలు చేసిన ఒకే దేశం- ఒకే మార్కెట్‌ చట్టం ఇక్కడ సీసీఐకి ఆయుధంగా మారి రైతులకు శరాఘాతమైంది. గతంలో జిల్లాకు చెందిన రైతులు దిగుబడైన పత్తిని తమకు 5 నుంచి 10 కి.మీ దూరంలో ఉండే యార్డుల్లోని సీసీఐ కేంద్రంలో విక్రయించారు. ఇప్పుడు 50 నుంచి 150 కి.మీ దూరంలో ఉండే ఎ.కొండూరు, జగ్గయ్యపేట, గుంటూరు జిన్నింగ్‌ మిల్లుల్లో విక్రయించాలి. ఇదంతా దూరాభారంగా ఉందని భావించి రైతులు తమ గ్రామాల్లోని ప్రయివేటు వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

47 వేల హెక్టార్లలో సాగు

జిల్లాలోని పశ్చిమకృష్ణాలో ఈ ఏడాది 47 వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. మెట్టప్రాంతంగా ఉన్న తిరువూరు, మైలవరం, నందిగామ, గన్నవరం, జగ్గయ్యపేట, నూజివీడు నియోజకవర్గాల పరిధిలో ఏటా 12 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి లభిస్తుంది. ఈ ఏడాది వరుసగా ఆగస్టు, సెప్తెంబరు, అక్టోబరులో భారీ వర్షాలతో పాటు ఇటీవల నివర్‌ తుపాన్‌ ప్రభావంతో పత్తి చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూత, పిందె రాలిపోయి, కాయలు కుళ్లి, దూది నల్లబడి నష్టం వాటిల్లింది. ఏటా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి లభించేది. ఈ ఏడాది ఎకరాకు ఆరేడు క్వింటాళ్ల దిగుబడి రావడం గగనమని రైతులు అంటున్నారు.

భారత పత్తి సంస్థ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌ పత్తికి రూ.5829. ఇప్పుడు వర్షాలు కారణంగా తడిసిన పత్తిని క్వింటాల్‌కు రూ.3 వేలు, నాణ్యమైన పత్తిని రూ.5వేలుకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ ఆంక్షలు భరించలేక రైతులు స్థానిక వ్యాపారులకే పత్తి విక్రయిస్తున్నారు. పత్తి దిగుబడులు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు సీసీఐ కేంద్రాల్లో 29వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడం ఇందుకు నిదర్శనం.

సీసీఐ అమలు చేసిన తాజా నిబంధనలు మార్కెట్‌ కమిటీల ఆదాయానికి గండి కొట్టాయి. గతంలో యార్డుల్లో ఒకశాతం మార్కెట్‌ రుసుం లభించేది. తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల ఏఎంసీలకు ఏటా సుమారు రూ.3 కోట్లు ఆదాయం వచ్చేది. వాస్తవంగా క్వింటా పత్తిని యార్డులో విక్రయిస్తే ఏఎంసీకి రూ.58 రుసుం లభిస్తుంది. యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే రైతు విక్రయించిన పత్తిని జిన్నింగ్‌ మిల్లుకు తరలించే బాధ్యత ఏఎంసీదే. ఇలా రవాణా చేస్తే క్వింటాకు రూ.130 ఖర్చు ఏఎంసీ భరించాల్సి ఉంది. ఆదాయం రాకపోగా రూ.70 అదనపు ఖర్చు భరించాలని ఏఎంసీ అధికారులు సీసీఐ కేంద్రాలపై ఆసక్తి చూపలేదు.

5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది

ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. వర్షాలతో పంట దెబ్బతింది. ఎకరాకు ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. చెట్లకు కాయ, దూదిలేదు. ఇక వర్షాలకు తడిసిన పత్తి క్వింటా రూ.3వేలు చొప్పున విక్రయించాను. స్థానిక వ్యాపారుల నాణ్యమైన దూది క్వింటా రూ.5వేలు అంటున్నారు. ఎ.కొండూరులో జిన్నింగ్‌ మిల్లుకు వెళ్లడం కష్టంగా ఉంది. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి అయింది. ఆ ఖర్చు రాదు. - పి.జమలయ్య, వినగడప

అందుబాటులో సీసీఐ కేంద్రం లేదు

ఈ ఏడాది 8 ఎకరాల్లో పత్తి సాగు చేశాను. అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గింది. మొదట 15 క్వింటాలు రూ.3200 చొప్పున విక్రయించాను. 20 క్వింటాల్‌ నిల్వ ఉండగా క్వింటా రూ.5వేలు ధర అంటున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో నాణ్యమైన పంటకు మద్దతు ధర లభించడం లేదు. - బి.రామస్వామి, రైతు

ఇదీ చదవండి:

చేనేతకు అందని చేయూత... కష్టాల్లో కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.