ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా మరో 44 కేసులు నమోదు. - ఏపీలో కరోనా కొత్త కేసులు

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. కొత్తగా మరో 44 కేసులు నమోదవడం వల్ల బాధితుల సంఖ్య 647కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఒకేరోజు 26 పాజిటివ్‌ కేసులు బయటపడగా శ్రీకాళహస్తిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులకు వైరస్‌ సోకడం.. ఆందోళన రేకెత్తిస్తోంది.

రాష్ట్రంలో కొత్తగా మరో 44 కేసులు నమోదు.
రాష్ట్రంలో కొత్తగా మరో 44 కేసులు నమోదు.
author img

By

Published : Apr 20, 2020, 4:09 AM IST

Updated : Jun 4, 2020, 3:16 PM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా మరో 44 కేసులు నమోదవటంతో మెుత్తం ఇప్పటికి ఆ కేసుల సంఖ్య 647కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా 158 కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 26 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఐదుగురు చనిపోగా ఒకరిని డిశ్చార్జి చేశారు. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు 39కు చేరినట్లు కలెక్టర్ తెలిపారు.శ్రీకాళహస్తిలో కొత్తగా 11 పాజిటివ్ కేసులు నమోదుకాగా.... వీరిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. మరో ఇద్దరు ఔషధ దుకాణాల యజమానులుగా తేలింది. 8 మందిలోఐదుగురు రెవెన్యూశాఖ, ఇద్దరు సచివాలయ ఉద్యోగులు, ఒకరు పోలీసు అధికారి అని చెప్పారు. వీరంతా కొద్దిరోజులుగా కరోనా రెడ్‌జోన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరెవరికీ అనుమానిత లక్షణాలు లేకపోయినా.. ముందు జాగ్రత్తగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. రెడ్‌జోన్‌కు సమీపంలో మందుల దుకాణాలు నిర్వహిస్తున్న మరో ఇద్దరికీ కరోనా నిర్థరణ కావడంతో ఆయా దుకాణాలకు ఎవరెవరు వచ్చి వెళ్లారో ఆరా తీస్తున్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 129కి పెరిగాయి. ఆదివారం కొత్తగా ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. అధికారులు, సిబ్బంది మండలాల్లోనే ఉండి పనిచేయాలని, పట్టణాలకు వచ్చి వెళ్లడం వంటివి చేయరాదని కలెక్టర్‌ ఆదేశించారు. మంగళగిరి సమీపంలోని ఎన్​ఆర్​ఐ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌ రావడంతో డిశ్చార్జ్​ చేశారు.నరసరావుపేటలో రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో మరో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు పీపీఈ యూనిట్ మెడికల్ ఆఫీసర్ నాగ పద్మజ ధ్రువీకరించారు. నరసరావుపేటలో 265 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 105 మందికి నెగిటివ్ వచ్చిందని మిగతావి రావాల్సి ఉందన్నారు.

మరోవైపు..కృష్ణా జిల్లాలో కొత్తగా 6, తూర్పుగోదావరిలో 5, గుంటూరు, అనంతపురంలో 3, విశాఖలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు.

ఇవీ చదవండి

కరోనా పాజిటివ్ వ్యక్తి డిశ్చార్జ్.. పరుగులు పెట్టిన అధికారులు!

Last Updated : Jun 4, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.