కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరగడం వల్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కొవిడ్ పరీక్షలు విస్తృతంగా చేయాలని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ మానిటరింగ్ ఎనాల్సిల్ సర్వీస్ క్వారంటైన్ బస్సుల్లో వైద్య పరీక్షలు చేస్తారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 12 బస్సులు అందుబాటులో వచ్చాయన్నారు. ఒక్కొక్క వాహనాల్లో 12 కౌంటర్లు ఉంటాయని... వీటి ద్వారా కరోనా లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 3 వేల పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. విజయవాడ నగరంలో 2 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. నగరపరిధిలోని కృష్ణలంక, అజిత్ సింగ్ నగర్, గుణదల, ఇందీరాగాంధీ స్టేడియం తదితర ప్రాంతాల్లో పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు కాల్ సెంటర్, ఎస్ఎంఎస్, మొబైల్ యాప్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ విషయమై మున్సిపల్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమై చర్చించారు.
ఇదీ చదవండి: