ETV Bharat / state

విజయవాడలో కరోనా విజృంభన..మూడు రోజుల్లో రెట్టింపు కేసులు

author img

By

Published : Apr 28, 2020, 7:41 AM IST

విజయవాడ పరిధిలో ఆందోళనకర స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడు రోజుల్లోనే రెట్టింపయ్యాయి. శుక్రవారం నాటికి వంద కేసులు ఉండగా సోమవారానికి 200 దాటిపోయాయి. వరుసగా శనివారం 25, ఆదివారం 52, సోమవారం 33 కేసులు కలిపి మూడు రోజుల్లోనే 110 మందికి జిల్లాలో పాజిటివ్‌ వచ్చింది. వీటిలో 95 కేసులు విజయవాడ నగరంలోనే నమోదయ్యాయి.

corona cases increase in vijayawada
విజయవాడలో కరోనా విజృంభన నిర్మాన్యుష్యంగా రహదారులు

విజయవాడ నగరంలో మొదటి కరోనా పాజిటివ్‌ కేసు మార్చి 21న నమోదైంది. ఏప్రిల్‌ 24వ తేదీకి జిల్లా మొత్తం కలిపి పాజిటివ్‌ కేసులు 102కు చేరాయి. వంద కేసుల నమోదుకు సరిగ్గా 35 రోజుల సమయం పట్టింది. కానీ ఆ తర్వాత మరో వంద కేసుల నమోదుకు కేవలం మూడే రోజులు పట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఎవరి ద్వారా వైరస్‌ సోకుతుందో తెలియని కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. తాజాగా పోలీసులు, రాజ్‌భవన్‌ సిబ్బంది సైతం వైరస్‌ బారిన పడ్డారు. సోమవారం నమోదైన కేసుల్లో తొమ్మిది మంది పోలీసులు, నలుగురు రాజ్‌భవన్‌ సిబ్బంది, ఒక వైద్యుడు ఉన్నారు.

ఆ రెండు ప్రాంతాల్లోనే 90...
విజయవాడ నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పుతోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కావడం లేదు. నగరవాసుల నిర్లక్ష్యమే వ్యాప్తికి ప్రధాన కారణంగా మారుతోంది. కొత్తగా ఆదివారం వచ్చిన కేసుల్లోనూ కృష్ణలంక, కార్మికనగర్‌ కలిపి పది పాజిటివ్‌ ఉన్నాయి. దీంతో కృష్ణలంకలో 50, కార్మికనగర్‌లో 40 కలిపి ఈ రెండు ప్రాంతాల్లోనే 90 కేసులు ఇప్పటివరకూ నమోదయ్యాయి. మిగతా ప్రాంతాలన్నింటిలో కొత్త కేసుల సంఖ్య కొంత అదుపులోకి వస్తున్నా ఈ రెండు హాట్‌స్పాట్‌లలో మాత్రం తగ్గడం లేదు. వారం రోజులుగా నిత్యం ఈ రెండు ప్రాంతాల్లో కచ్చితంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

కొత్తగా వచ్చిన 33 కేసులు ఇవే..
* విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న నున్న(2), మాచవరం(4), ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌(1)ల పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒక సైబర్‌ క్రైమ్‌ మహిళా ఎస్సై, ఏడీసీపీ కలిపి ఎనిమిది మందికి తాజాగా సోమవారం పాజిటివ్‌ వచ్చింది.
* సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న రాజ్‌భవన్‌లో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు కరోనా వైరస్‌ బారినపడ్డారు.
* కృష్ణలంకలో ఆరుగురికి, కార్మికనగర్‌లో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.
* రామలింగేశ్వరనగర్‌, ఆటోనగర్‌, పూర్ణానందపేట, సింగ్‌నగర్‌, రాజీవ్‌నగర్‌, కొత్తపేట, పాయకాపురంలో ఒక్కొక్కరికి వైరస్‌ సోకింది.
* మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.
* పెనమలూరు పరిధిలోని యనమలకుదురులో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది.

కొవిడ్‌ ఆస్పత్రి వైద్యుడికి పాజిటివ్‌
విజయవాడ కొవిడ్‌ ఆస్పత్రిలో సేవలందిస్తున్న ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. వైద్యుడికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజాగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడిని ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలోని మరో ముగ్గురు వైద్య సిబ్బందికి సైతం కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. పరీక్షల నివేదిక మంగళవారం వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి...

'కరోనా పరీక్షల్లో ర్యాపిడ్​ కిట్స్​ నాణ్యతే కీలకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.