రాష్ట్రంలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 2 వేల 558 కొవిడ్ వైరస్ కేసులను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఆరుగురు వైరస్ బారిన పడి మరణించారు. మరో 853 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
ఆ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున..
కొవిడ్‌తో గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. వైరస్ బారిన పడి నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. వైరస్ బారి నుంచి మరో 853 మంది బాధితులు కోలుకున్నారు.
13,276 యాక్టివ్ కేసులు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 276 యాక్టివ్ కేసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 31 వేల 657 కొవిడ్ పరీక్షలను నిర్వహించారు.