ETV Bharat / state

కొనుగోళ్లు లేవంటున్న అధికారులు.. రోడ్డుపైనే మొక్కజొన్న రైతుల ఇబ్బందులు

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలిలోని రైతు భరోసా కేంద్రం వద్ద మొక్కజొన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లకు అనుమతి లేదని అధికారులు అంటున్నారు. రహదారిపైనే వాహనాలు నిలిపి రైతులు ఎదురు చూస్తున్నారు.

corn farmers difficulties at RBK centers in andhra pradesh

author img

By

Published : Jun 3, 2021, 2:16 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలిలోని రైతు భరోసా కేంద్రం వద్ద మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న పంటను కేంద్రానికి రైతులు తీసుకురాగా.. కొనుగోళ్లకు ఎలాంటి అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. వారి తీరుతో.. రైతులు ఆవేదన చెందుతున్నారు. రహదారిపైనే వాహనాలు నిలిపి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షం వస్తే పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కొడాలి రైతు భరోసా కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పటికి సుమారు 80 శాతం విక్రయాలు జరిగాయి. ఇంకా 20 శాతం పంట కొనుగోలు చేపట్టాల్సి ఉంది. పంటకు సంబంధించి రైతులు ఆయా పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోగా, రైతులకు షెడ్యూలింగ్ కూడా ఇచ్చారు. ఆన్ లైన్ ద్వారా మెసేజ్ చూసుకున్న రైతులు తమ పంటలను తీసుకుని కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. కొనుగోళ్లకు అంగీకరించని అధికారుల తీరుపై ఆగ్రహించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో.. మరో జాయింట్ కలెక్టర్ పోస్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.