ETV Bharat / state

Construction Workers Met Lokesh in Gannavaram: నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా.. మెరుగైన పాలసీతో గత వైభవం: లోకేశ్ - లోకేశ్ తాజా వాఖ్యలు

Construction Workers Met Lokesh in Gannavaram: గన్నవరంలోని చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు వద్ద రాష్ట్ర భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులు టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్​తో సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్న లోకేశ్.. సానుకూలంగా స్పందించారు. యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

Construction_Workers_Met_Lokesh_in_Gannavaram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2023, 4:01 PM IST

Updated : Aug 23, 2023, 9:39 PM IST

Construction Workers Met Lokesh in Gannavaram: నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా.. మెరుగైన పాలసీతో గత వైభవం తీసుకొస్తాం : నారా లోకేశ్

Construction Workers Met Lokesh in Gannavaram : గన్నవరం నియోజకవర్గంలో 192వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. జగన్‌ ధనదాహం 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి నిర్మాణరంగానికి పరిశ్రమ హోదా కల్పించి మళ్లీ గత వైభవం తెస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. అంతకు ముందు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి లోకేశ్‌ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. వంశీని రాజకీయాల నుంచి బహిష్కరించేందుకు అందరు కలిసికట్టుగా పనిచేయాలి లోకేశ్‌ కోరారు.

నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తెస్తాం : సీఎం జగన్ మోహన్ రెడ్డి ధనదాహం 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అక్రమ సంపాదన కోసం కార్మికుల జీవితాలను చీకటిమయం చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ దుయ్యబట్టారు. గత 51 నెలల్లో ఇసుకపై జగన్ అండ్ కో 10 వేల కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపించారు.

గన్నవరం నియోజకవర్గం చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో.. రాష్ట్ర భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులతో సమావేశమైన లోకేశ్‌ అధికారంలోకి రాగానే మెరుగైన ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి పూర్వ వైభవం (Nara lokesh Promises to Construction Workers) తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదాతో పాటు, రాయితీలు కల్పించి అండగా నిలుస్తామన్నారు.

Nara Lokesh Public Meeting in Gannavaram: "ఇసుక దందాలో జగన్‌ రోజూ రూ. 3 కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు"

టీడీపీలో చేరిన నేతలు : అంతకముందు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ (YSRCP Leaders join in TDP) నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గన్నవరం వేదికగా లోకేశ్ సమక్షంలో కొందరు సిట్టింగ్ ఎమ్​పీటీసీలు, మాజీ ఎమ్​పీపీలు, సర్పంచ్ లు, సహకార బ్యాంకు సభ్యులు పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీలో అవమానాలు తాళలేకే బయటకు వచ్చామన్న యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పాత నేతలను సమన్వయం చేసుకుంటూ గన్నవరంలో తెలుగుదేశం జెండా ఎగుర వేద్దామని పార్టీ శ్రేణుల్ని కోరారు.

లోకేశ్​కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం : పార్టీలో చేరికల కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఓటమే, తనలో కసిపెంచిందని అన్నారు. జగన్ లా... తాను తండ్రి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకోని కూర్చోలేదంటూ చురకలు అంటించారు. మంగళగిరిని తెలుగు దేశానికి కంచుకోటగా మార్చి మంచి నాయకుడిని అనిపించుకుంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ప్రకటించిన లోకేశ్‌.. వంశీకి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్పష్టం చేశారు.

Lokesh With BC Community Leaders: టీడీపీ హయాంలోనే బీసీ కులాల అభివృద్ధి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక నిధి: లోకేశ్

ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు : మంగళగిరిలో ఓటమిపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు లోకేశ్ కౌంటర్‌ ఇచ్చారు. ఓడిన చోటే తిరిగి గెలిచి చూపిస్తానన్నారు. కృష్ణా జిల్లాకు క్షమాపణ చెప్పాలన్న వైసీపీ నాయకుల డిమాండ్​ను లోకేశ్‌ తిప్పికొట్టారు. అభివృద్ధి చేసినందుకు క్షమాపణ చెప్పాలా అంటూ నిలదీశారు. లోకేశ్ మాట్లాడుతున్న సమయంలో కరెంటు పోవడంతో... 24 గంటలు కరెంట్‌ ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

హోంగార్డుల జీతాలు : హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని లోకేశ్‌ సీఎంకు లేఖ రాశారు. హోంగార్డులకు జీతాలు పెంచి, సౌకర్యాలు కల్పించాలని కోరారు. చాలీచాలని జీతాలతో హోంగార్డుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. కరోనా వేళ హోంగార్డులు అందించిన సేవలు మరచిపోలేమన్న లోకేశ్‌.. హోంగార్డులకు ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చాలని కోరారు. భవన నిర్మాణ కార్మిక సమాఖ్య ప్రతినిధులతో సమావేశానికి ముందు పార్టీ కార్యకర్తలు, అభిమానులతో లోకేశ్ సెల్ఫీలు దిగారు.

NO WORK TO CONSTRUCTION LABOUR: ఏ పనైనా ఓకే.. ఉపాధి దొరక్క రోజువారీ కూలీల కష్టాలు!

Last Updated : Aug 23, 2023, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.