సిమెంటు, ఇనుము ధరలను తగ్గించడంతో పాటు నియంత్రణకు రెగ్యులేటరీ అథారిటీని నియమించాలని వర్కర్స్ అసోషియేషన్ల ఐక్యకార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. విజయవాడలో బీఏఐ, క్రెడాయ్, నారెడ్కో, సబ్‌కా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. మార్కెట్‌లో డిమాండ్ లేకపోయినా ఉత్పత్తి సంస్థలు, కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఆరు నెలల్లో సిమెంటు, ఇనుము ధరలను 40 శాతం పెంచడం వల్ల నిర్మాణ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, రెరా, ఇసుక, నిపుణులైన కార్మికుల కొరత, కరోనాతో పూర్తిగా స్తంభించిందని, లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారని వివరింంచారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే నిరసన చేపడుతున్నామని తెలిపారు. నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని రాయితీలు కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: