ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విజయవాడలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. అమెరికా పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ఆందోళన చేశారు. 'హౌడీ మోదీ' సభలో వచ్చే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని ప్రధాని మోదీ చెప్పడం, అందుకు ట్రంప్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆందోళనకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ ఒక్కరేనని రామకృష్ణ అన్నారు.
ఇదీ చదవండి :
"ప్రయాణికులను కాపాడిన వారికి నగదు పురస్కారం"