ETV Bharat / state

పెట్రోల్​ ధరల పెంపుని నిరసిస్తూ..

పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా విజయవాడ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటు పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

Congress_Cycle_Rally
పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసనగా
author img

By

Published : Jul 12, 2021, 1:32 PM IST

పెరిగిన పెట్రోల్​, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని విజయవాడ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు.సైకిల్ ర్యాలీలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నర్శింహారావు పాల్గొన్నారు. అధిష్టానం పిలుపు మేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల, పెట్రోల్ ధరలు తగ్గించాలని నిరసన చేస్తున్నామని నరసింహారావు అన్నారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం దారుణమని, 15వ తేదీన నగరంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.

ఇది చదవండి: Corona cases: దేశంలో కొత్తగా 37,154 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.