కృష్ణాజిల్లా నందిగామ మండలం చెరుకుమ్ముపాలెం గ్రామంలో... పొలం గురించి జరిగిన గొడవ కారణంగా... అన్నదమ్ములు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. జమ్ములమూడి నరసింహారావు, ఆంజనేయులు అనే అన్నదమ్ములకు కొంత కాలంగా పొలం విషయంలో తగాదా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా... నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి