పేదలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం రూపొందించే లేఅవుట్లలో పట్టణ ప్రణాళిక చట్టానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిబంధనల అమలు తప్పనిసరని పేర్కొన్నారు. లే - అవుట్ల తయారీలో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచిస్తూ పురపాలకశాఖ కార్యదర్శి జీవో విడుదల చేశారు. వీటి కోసం చేపట్టే భూసమీకరణలో తలెత్తే వివిధ సాంకేతిక సమస్యలను కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్‌తో లే-అవుట్ ప్లాన్ తయారు చేయించాలని సూచించారు. వీటి కోసం పట్టణ ప్రణాళిక విభాగ సేవలూ ఉపయోగించుకోవచ్చని తెలిపారు. లే - అవుట్‌లో... 30 అడుగుల రహదారి కోసం స్థలాన్ని విధిగా కేటాయించి బృహత్తర ప్రణాళికలో చేర్చాలన్నారు. ఉద్యానవనం కోసం 10 శాతం, సామాజిక భవనం, పాఠశాల, ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు మరో 3 శాతం, వాహన పార్కింగ్ కోసం ఐదు శాతం విడిచి పెట్టాలని సూచించారు.
పేదల ఇళ్ల లే అవుట్లకు నిబంధనలు తప్పనిసరి - పేదల ఇళ్ల స్థలాలకు రుపొందించే లేఅవుట్లలో నిబంధనలు తప్పనిసరి
పేదలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం రూపొందించే లేఅవుట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచిస్తూ పురపాలకశాఖ కార్యదర్శి జీవో విడుదల చేశారు. భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కల్పనకు నిబంధనలు అమలు తప్పనిసరని పేర్కొన్నారు.
![పేదల ఇళ్ల లే అవుట్లకు నిబంధనలు తప్పనిసరి పేదల ఇళ్ల స్థలాలకు రుపొందించే లేఅవుట్లలో నిబంధనలు తప్పనిసరి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5915075-534-5915075-1580510047290.jpg?imwidth=3840)

ఇవీ చదవండి: