కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. గత మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. పెంచిన వేతనాలతో పాటుగా కాస్మోటిక్ ఛార్జీలు సైతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని.., లేకపోతే విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు సైదులు, మండల కార్యదర్శి గోపాల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...