అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 25 వరకు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసులు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
మెడికల్ దుకాణాలకు తప్ప… ఇతర దుకాణాలకు అనుమతులు ఇవ్వలేదు. మాంసాహార విక్రయాలు నిషేధించారు. తెల్లవారుజామున లాక్ డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ నాగాయలంక నుంచి ఇతర ప్రాంతాలకు పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న 12 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు.