ETV Bharat / state

కృష్ణానదికి పోటెత్తుతున్న వరద... ముంపు ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ

ఎగువ నుంచి కృష్ణానదికి భారీగా వరద నీరు చేరుతున్న దృష్ట్యా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టరు జె.నివాస్‌ విజ్ఞప్తి చేశారు. తన క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ, నీటిపారుదల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు భారీగా వస్తోందన్నారు.

collector visits flooded areas at krishna district
ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
author img

By

Published : Aug 1, 2021, 12:28 PM IST

కృష్ణానదికి వరద పోటెత్తడంతో...అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు భారీగా వస్తోందని కలెక్టరు జె.నివాస్‌ అన్నారు. శ్రీశైలం నుంచి సుమారు 5.58 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని... దాన్ని దిగువకు విడుదల చేస్తున్నారన్నారు. అలాగే నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 256 టీఎంసీల నీరు ఉందని కలెక్టరు తెలిపారు. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయికి చేరుకోవడానికి కనీసం 56 టీఎంసీలు కావాలన్నారు. సాగర్‌ డ్యాం రేపు ఉదయానికి నిండుతుందని... ఆ తర్వాత ఐదు లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతల ప్రాజెక్టుకు వదులుతారన్నారు. పులిచింత ప్రాజెక్టులో ఇప్పటికే సామర్ధ్యం మేరకు పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్నందున... అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకు వరద నీరు రేపు సాయంత్రానికి చేరుకుంటుందన్నారు.

వరద ఉద్ధృతి ఎక్కువుంది.!

జగ్గయ్యపేట నుంచి నాగాయలంక వరకు నదీ పరివాహక ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడుదల అయిన తర్వాత ఐదు వరద కాలువల నుంచి నివాస ప్రాంతాల్లోకి నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వరద నీరు నిరోధించాకు ఆయా ద్వారాలను సిమెంట్‌, ఇసుక బ్యాగ్‌లతో మూసివేసి వచ్చే నీటిని ఎత్తివేసేందుకు మోటార్లను సిద్ధం చేయాలన్న్నారు.

స్థానికులు జాగ్రత్తగా ఉండాలి

రాత్రి సమయంలో నీరు వస్తే వృద్ధులు, పశువులు, పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున- నీటిప్రవాహం పట్ల అప్రమత్తత అవసరమన్నారు. పశువులను, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నదిలో వరదనీరు ప్రమాదకర స్థాయిలో ఉంటుందని... ఆ సమయంలో ఎవరూ ఈతకు వెళ్లొద్దని కలెక్టరు హెచ్చరించారు. గత ఏడాది బరంపార్కులో వరదనీరు ఎక్కువగా వచ్చిందని... ఈ సమయంలో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. జగ్గయ్యపేట నుంచి నాగాయలంక వరకు 15 మండలాల తహసీల్దార్లు రాత్రి వేళల్లో కూడా వరద పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. నాగాయలంక , కోడూరు , అవనిగడ్డ , మోపిదేవి , చల్లపల్లి , మచిలీపట్నం మండలాల్లో సముద్ర నదితీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.లంక గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు..

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

మత్స్యశాఖ బోట్లు , గజఈతగాళ్లను సిద్ధం చేయలన్నారు . అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని , సహాయ పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలు గుర్తించాలని అన్నారు. ఆయా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి సిబ్బందికి విధులు కేటాయించాలని ఎప్పటికప్పుడు వరద పరిస్థితి పరిశీలించి అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇదీ చూడండి.

polavaram: పోలవరం వరద కష్టాలు.. గ్రామాలను వదిలిపోతున్న నిర్వాసితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.