నేటి నుంచి విడతల వారీగా పాఠశాలలు తెరుచుకోనుండటంతో అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలోని పెనమలూరు ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇంతియాజ్ సందర్శించారు. బడి నిర్వహణలో భాగంగా వైరస్ వ్యాప్తి చెందకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. భౌతిక దూరం, శానిటైజర్, మాస్క్ వినియోగం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారని జిల్లా పాలనాధికారి తెలిపారు. తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించామని..పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: