ETV Bharat / state

నిధులు కావాలంటే నేనిస్తా.. పనులు మొదలుపెట్టు.. అధికారిపై కలెక్టర్ ఆగ్రహం - అధికారిపై కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆగ్రహం

Collector fires on RWS SE: 'నిధులు కావాలంటే నేనిస్తా పనులు మొదలుపెట్టు' అంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా.. ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈ పై ఆగ్రహానికి గురయ్యారు. వారం రోజులుగా గన్నవరం మండలం తెంపల్లిలో అతిసారంతో ముగ్గురు మృతి చెందటంపై ఆరా తీశారు. ఈ క్రమంలో తాగునీటి నిర్వహణ సరిగా లేకపోవటంతో ఎస్​ఈపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

collector ranjith basha fires on SE over diarrhea cases in tempally at krishna district
యూస్​లెస్ ఫెలో నిధులు కావాలంటే నేనిస్తా పనులు మొదలుపెట్టు.. అధికారిపై కలెక్టర్ ఆగ్రహం
author img

By

Published : Jul 18, 2022, 8:10 PM IST

Updated : Jul 18, 2022, 8:17 PM IST

Collector fires on RWS SE: కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లిలో కలెక్టర్ రంజిత్ బాషా పర్యటించారు. వారం రోజులుగా అతిసారంతో గ్రామంలో ముగ్గురు మృతిపై ఆరా తీశారు. గ్రామంలో అధ్వానంగా ఉన్న వీధుల్లో కలెక్టర్ పర్యటించారు. తాగునీరు కలుషితం కావడం వల్లే అతిసారం కేసులు పెరిగాయని కలెక్టర్ తెలిపారు. తాగునీటి నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈ లీలాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్​డబ్ల్యూఎస్ ఎస్ఈపై కలెక్టర్ రంజిత్ బాషా ఆగ్రహం

'నిధులు కావాలంటే నేనిస్తా.. పనులు మొదలుపెట్టు.. మేము చెబుతుంది ఏంటి.. మీరు చేస్తుంది ఏంటీ' అంటూ మండిపడ్డారు.

ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్న కలెక్టర్.. వైద్య శిబిరం ఏర్పాటు చేసి ముమ్మర సేవలందిస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య చర్యలపై సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 18, 2022, 8:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.