కృష్ణా జిల్లాలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు నూతన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రోజుకు 90 నుంచి 95 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతున్నట్లు పేర్కొన్నారు. 77 కొవిడ్ ఆసుపత్రుల్లో 3 వేలకు పైగా ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్హెచ్ఏఐ సహకారంతో జిల్లాలో పలు చోట్ల గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు స్పష్టం చేశారు.
జూన్ నాటికి కొన్ని అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తున్నారన్నారు. సిద్ధార్ధ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్ధులు కోటి రూపాయలకు పైగా ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి విరాళం ఇచ్చినట్లు ఇంతియాజ్ తెలిపారు. జిల్లాలో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి: