ETV Bharat / state

CM YS Jagan Reviewed on Medical and Health Department: 'ఆరోగ్య సురక్ష'ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి: సీఎం జగన్ - ఆరోగ్య శ్రీ

CM YS Jagan Reviewed on Medical and Health Department: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న సీఎం... చికిత్స అనంతరం మందులు ఖరీదైనా అందించాలన్నారు. అవగాహన, పర్యవేక్షణ కోసం ప్రతి ఒక్కరి ఫోన్లలో ఆరోగ్య శ్రీ డౌన్ లోడ్ చేయాలన్నారు.

cm_ys_jagan_reviewed_on_medical_and_health_department

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 7:16 PM IST

CM YS Jagan Reviewed on Medical and Health Department : ఆరోగ్య శ్రీ చికిత్స కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తిరుపతి తరహాలోనే చిన్నపిల్లల కోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను నిర్దేశించారు. ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ (Kidney Research Center)ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతోన్న తీరుపై సీఎం ఆరా తీయగా.. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు అందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అక్టోబరు 11వ తేదీ వరకు 1,22,69,512 కుటుంబాలపై సర్వే చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ 3కోట్ల 17 లక్షల 65 వేల 600 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనదన్న సీఎం.. కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టను పెంచుతుందన్నారు. దీనివల్ల రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలన్నారు. రోగులకు ఇస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ప్రతి కలెక్టర్‌కూ దీనిపై ప్రత్యేక ఆదేశాలు, మరిన్ని నిధులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

CM Jagan Review on Agriculture, Civil Supplies Departments: రైతులు పండించిన పంటకు కచ్చితంగా మద్దతు ధర దక్కాలి: సీఎం జగన్

పాతరోగులకు చేయూత: హెల్త్‌క్యాంపులను నిర్వహిస్తూనే చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం బాగు అయ్యేంతవరకూ చేయిపట్టుకుని నడిపించాలన్నారు. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. క్రమం తప్పకుండా వారికి చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ(Arogya Sree)లో కవర్‌ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల కూ చేయూత అందించాలన్నారు. ఆరోగ్య పరంగా, చికిత్సలు, చెకప్‌, మందులపరంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ చేయూత ఉండాలన్నారు. ప్రతి సచివాలయం వారీగా ఇలా ఎవరెవరు ఉన్నారనేది వివరాలు తీసుకోవాలని, దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుందన్నారు. విలేజ్‌క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లతో దీన్ని అనుసంధానం చేయాలని సీఎం నిర్దేశించారు. క్రమం తప్పకుండా హెల్త్‌క్యాంపులను నిర్వహించాలని సూచించారు. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఆరోగ్య సురక్షపై ప్రతి వారం క్రమం తప్పకుండా తాను సమీక్ష చేయనున్నట్లు సీఎం తెలిపారు.

Many Restrictions During CM Jagan Samarlakota Tour: సార్ వస్తే అన్నీ బంద్ కావాల్సిందే.. ఆంక్షల వలయంలో సామర్లకోట

అందరి ఫోన్లలో ఆరోగ్య శ్రీ యాప్​: ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదన్న సీఎం.. ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో కూడా ఆరోగ్య శ్రీ యాప్‌ని డౌన్లోడ్‌ చేయాలని, దీనివల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందన్నారు. క్యాంపులకు స్పెషలిస్టులను పంపే విషయంలో మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఎక్కడా తొందరపాటు లేకుండా రోగులకు మంచి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యాంపులకు తప్పనిసరిగా నలుగురు వైద్యులు వెళ్లాలని, అందులో ఇద్దరు స్పెషలిస్టులు ఉండాలన్నారు. దీనికి తగినట్టుగా స్పెషలిస్టులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇప్పటివరకూ 5216 ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహించామని, సగటున ఒక్కో క్యాంపులో 357 మంది వస్తున్నట్టు వెల్లడించారు. క్యాంపుల ద్వారా దాదాపు 2841 మంది రక్తహీనత ఉన్న బాలికలను గుర్తించామని, వీరికి అన్నిరకాలుగా మందులు, పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించిన వారికి పౌష్టికాహారాన్ని అక్కడే అందించేలా ఎస్‌ఓపీ రూపొందించాలని సీఎం నిర్దేశించారు.

CM Camp Office At Visakha: విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై కమిటీ

విజయవాడ–గుంటూరు, విశాఖలో చిన్నపిల్లల ఆస్పత్రి: పుట్టుకతోనే వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి 251 మందిని శిబిరాల్లో గుర్తించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలోనూ మార్పులు రావాలని సీఎం అన్నారు. నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్షా శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వీరికి సర్టిఫికెట్లు జారీచేసేలా ఆలోచన చేయాలన్నారు. తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, వారికి అవసరమైన ఖరీదైన మందులు అందించే కార్యక్రమం జరగాలని సీఎం నిర్దేశించారు. మందులు అందడంలేదన్న మాట రోగులనుంచి రాకూడదన్నారు. తిరుపతి తరహాలోనే చిన్నపిల్లలకోసం అత్యాధునిక ఆస్పత్రిని విజయవాడ–గుంటూరు, విశాఖపట్నంలో ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను నిర్దేశించారు. ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు, కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణ ప్రగతిపై సమీక్షించిన సీఎం.. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనుల్లో పురోగతిని సీఎంకు వివరించారు. అర్బన్ హెల్త్‌ క్లినిక్కులు నిర్మాణ పనులను నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

AP Capital Shifting to Visakhapatnam: కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ.. రాజధానిని విశాఖకు తరలించేందుకు రంగం సిద్ధమా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.