ETV Bharat / state

సాయిప్రణీత్​ మరిన్ని విజయాలు సాధించాలి: సీఎం జగన్ - amaravati

అర్జున అవార్డు తీసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిప్రణీత్​కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

జగన్
author img

By

Published : Aug 30, 2019, 5:52 AM IST

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్​ అర్జున అవార్డు తీసుకోవటంపై ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈమేరకు ట్విట్టర్​లో సందేశం పంపారు.

జగన్
జగన్

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి ప్రణీత్​ అర్జున అవార్డు తీసుకోవటంపై ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈమేరకు ట్విట్టర్​లో సందేశం పంపారు.

జగన్
జగన్

ఇది కూడా చదవండి.

కోడెల అత్యవసర పిటిషన్​పై హైకోర్టులో విచారణ

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

( ) అనంతపురం జిల్లా ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ సందర్భంగా జరిగిన తోపులాటలో అన్యాయంగా ఓ రైతు మృతి చెందాడు. ఈ పాపానికి కారకులెవరు ఏజెన్సీ నిర్వాహకమా లేక అధికారుల నిర్లక్ష్యం తెలియాల్సి ఉంది.

వందలాది మంది రైతులు వస్తే ఎంపీడీవోలు కూర్చోడానికి మాత్రమే టెంట్లు వేసి క్యూలైన్లో నిల్చున్న రైతులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు వారికి టెంట్లు వేయకుండా గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు చనిపోయిన తర్వాత జిల్లా అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని టెంటు తెప్పించి వేయించారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఏజెన్సీ వారిపై వ్యవసాయ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏజెన్సీ చేతకానితనం అధికారుల నిర్లక్ష్యం కారణంగా విత్తనాల కోసం వచ్చిన ఓ రైతు నిండు ప్రాణం బలైంది. విత్తనాల కోసం వచ్చిన రైతులకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండలో నిలబడిన రైతులు ఎండ తాపానికి తట్టుకోలేక సొమ్మసిల్లి పోతున్నారు. రాకెట్ల గ్రామానికి చెందిన సిద్ధప్ప అనే రైతు విత్తనాల కోసం రెండు గంటల సేపు క్యూలైన్లో నిలుచున్నాడు. ఒక్కసారిగా రైతులందరూ తోపులాడుకోవడంతో ఆ రైతు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి రైతులు ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

అయితే ఏజెన్సీ నిర్వాహకులు ఏర్పాట్లు చేయలేదని కేవలం ఎంపీడీవోలు కూర్చోడానికి మాత్రమే ఒక సేమియానా వేయించారని, క్యూ లైన్లో నిల్చున్న రైతులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని సెమియన (టెంట్లు) కూడా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఏర్పాటు చేయలేదని విత్తనాల కోసం వచ్చిన రైతులు ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడుతున్నారు.

వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీరి పాపానికి సిద్ధప్ప అనే రైతు అన్యాయంగా మృతిచెందాడని ఇతర రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఆర్డీవో కానీ వ్యవసాయ శాఖ కానీ తూతూ మంత్రంగా విచారణ చేసి చేతులు దులుపుకున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతి చెందిన రైతు అనారోగ్యంతోనే మృతి చెందినట్లు అధికారులు తెలపడం గమనార్హం.


Body:బైట్స్ : రైతులు.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 29-08-2019
sluge : ap_atp_05c_29_seed_distribution_farmer_deaths_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.