'వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష' పేరిట చేపట్టిన పథకాన్ని ఈనెల 21న కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో భూముల సమగ్ర సర్వే పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సీఎం కార్యక్రమం సందర్భంగా పలు శాఖల అధికారులతో సీఎం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం ఏర్పాట్లను పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను , కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవి లత, సబ్ కలెక్టర్ ధ్యాన చంద్రతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కళాశాల ఆవరణలో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: పశ్చిమగోదావరి జిల్లాలో ఏఎస్ఐపై కత్తితో దాడి