రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏయే పంటలు, ఎక్కడ ఎంతమేర సాగుచేయాలనేదానిపై ఈ బోర్డులు సలహాలు ఇవ్వాలన్న జగన్... వీటి ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంపై లాక్‌డౌన్ ప్రభావంపై సమీక్షలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులు పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి... ఆ ధర దక్కేలా చూడాలని ఆదేశించారు.
కర్నూలులో రెడ్జోన్లో ఉన్నందున ఆ ప్రాంతంలో రైతులు పండించిన ఉల్లిపాయలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించి మార్కెటింగ్ చేయాలని సీఎం చెప్పారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. బత్తాయి, అరటి, ఉల్లి, మామిడి, టమాట పంటల విషయంలో అప్రమత్తంగానే ఉన్నామన్నారు. మిల్లర్లు ధాన్యం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా సీసీఆర్సీ కార్డులు తీసుకున్న కౌలు రైతులు కూడా రైతు భరోసాకు అర్హులేనని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి