ETV Bharat / state

'అధికారులు, ప్రజా ప్రతినిధులు క్రికెట్ జట్టులా కలసి పనిచేయాలి' - cm jagan comments on volunteers

రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు క్రికెట్ జట్టులా కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. క్రికెట్ జట్టులో కెప్టెన్ ఒక్కడు మాత్రమే గెలవలేడని.. జట్టు మొత్తం కలసి ఆడితేనే గెలుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నామని... భవిష్యత్తులోనూ ఇది కొనసాగాలని కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సచివాలయంలో నిర్వహించిన హెచ్ఓడీల సమావేశానికి హాజరైన సీఎం జగన్.. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న తీరుపై ప్రసంగించారు. మంచి పాలన అందించేందుకు నేరుగా సూచనలు, సలహాలు తనకు అందించాలని స్పష్టం చేశారు.

cm-jagan
cm-jagan
author img

By

Published : Feb 10, 2021, 6:15 PM IST

Updated : Feb 11, 2021, 9:10 AM IST

అధికారులు, ప్రజాప్రతినిధులు క్రికెట్ జట్టులానే కలసి పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. క్రికెట్​లో కెప్టెన్ మాత్రమే ఎప్పుడూ గెలవడని జట్టు సభ్యులంతా కలిసి ఆడితేనే గెలుపు సొంతమవుతుందని ఉదహరించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం పాలన ప్రారంభించి 20 నెలలు అవుతోందని.. అధికారులందరి సహకారంతోనూ అడుగులు ముందుకు వేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో సీఎస్ నిర్వహించిన సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి.. కీలకమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రజాధనం ఆదా చేసే ప్రయత్నం..

పాలన చేపట్టిన నాటి నుంచి విప్లవాత్మకమైన నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు సీఎం వివరించారు. దిశ చట్టం నుంచి గ్రామ వార్డు, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ.. ఈ జాబితాలో ఉన్నాయన్నారు. ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాల్లో ప్రజాధనాన్ని ఆదా చేయగలిగామని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్ల లాంటి అంశాల లోతుల్లోకి వెళ్లి ప్రజాధనం ఆదా చేసే ప్రయత్నం చేశామన్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ ద్వారా టెండర్లలో అవినీతిని నియంత్రిస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు.

కీలక నిర్ణయాలతో ప్రజలకు చేరువ..

నగదు బదిలీ ప్రక్రియ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే రూ.90 వేల కోట్లను ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీ చేయగలిగామని సీఎం అన్నారు. దీంతో పాటు ఆంగ్లమాధ్యమం పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లీనిక్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, భూముల రీసర్వే లాంటి కీలకమైన నిర్ణయాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నట్టు సీఎం అధికారులతో వెల్లడించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలిచ్చామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాల్లో అధికార యంత్రాంగం కూడా మనసు పెట్టి పనిచేసిందని హర్షం వ్యక్తం చేశారు.

సలహాలు ఇవ్వాలి..

ప్రస్తుతం పాలనలో మధ్యకాలానికి చేరుకుంటున్నందున మరోమారు అంతా పథకాల అమలుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. సుపరిపాలనకు అధికారులు ఆలోచన చేయాలని.. సూచనలు, సలహాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. నేరుగా తనకు నివేదించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం మేర మేనిఫెస్టో అంశాలను పూర్తి చేసిందని ఇతర హామీలను పూర్తి చేసేందుకు అధికారులు సహకారాన్ని అందిచాలని సీఎం కోరారు.

వాలంటీర్లకు సన్మానం..

గత ప్రభుత్వ హయాంలో రూ.60 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అలాగే జన్మభూమి కమిటీల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సీఎం వ్యాఖ్యానించారు. కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు దెబ్బతినే స్థాయిలో ఉన్నాయని ఇలాంటి పరిస్థితులను మార్చి.. ప్రస్తుతం పాలన గాడిలో పెట్టామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించటంలో వాలంటీర్లది కీలకపాత్ర అని సీఎం చెప్పారు. వాలంటీర్లు ఉద్యోగం చేయటం లేదని సేవచేస్తున్నారని.. ప్రజలకు సేవచేస్తున్నవారిని ప్రతీ ఏటా ఉగాది అనంతరం సత్కరించేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు.

ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకైనా సిద్ధం'

Last Updated : Feb 11, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.