పొగాకు రైతుల ఇబ్బందులు పరిష్కరించడంపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. రైతులను ఆదుకొనేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. ఓ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో రెండు, మూడురోజుల్లో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పొగాకు కనీస ధరలు ప్రకటించి, ధరల జాబితాను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఉంచనుంది. లైసెన్స్ ఉన్న పొగాకు వ్యాపారులు, కంపెనీలు వేలంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. లేకుంటే ఆయా వ్యాపారులు, కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేయనున్నారు. వేలం జరిగే అన్నిరోజుల్లోనూ కొనుగోళ్లలో పాల్గొనడం సహా, నిర్దేశించిన లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరపాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి రేపే రాజ్యసభ ఎన్నికలు.. రాష్ట్రంలోని 4 స్థానాలకు పోలింగ్