మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో హోంమంత్రి, డీజీపీ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి వారి ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసేలా చూడాలని సూచించారు. మహిళల ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు.
దిశ యాప్‌పై ముందుగా మహిళా పోలీసులు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని.. ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారు. కళాశాలలు, విద్యాసంస్థల్లోనూ యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. దిశ, స్థానిక పీఎస్‌లు సత్వరమే స్పందించేలా సన్నద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పోలీసుస్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్ వాహనాలు సమకూర్చాలన్నారు.
ఇదీ చదవండి: