ETV Bharat / state

Attack: కత్తులతో దాడులు చేసుకున్న వైకాపా, తెదేపా వర్గాలు

కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరాముని పేటలో ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా, తెదేపాలకు చెందిన సానుభూతిపరులు..కత్తులతో దాడులు చేసుకున్నారు. ఘటనలో కొందరికి గాయాలు కాగా.. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కత్తులతో దాడులు చేసుకున్న వైకాపా, తెదేపా వర్గాలు

author img

By

Published : Mar 22, 2022, 4:33 PM IST

కత్తులతో దాడులు చేసుకున్న వైకాపా, తెదేపా వర్గాలు

కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరాముని పేటలో ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం, వైకాపా సానుభూతిపరులు.. పరస్పరం కత్తులతో దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇరువర్గాల మధ్య చిన్న ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ ఘర్షణలు కత్తులతో దాడుల చేసుకునే వరకూ వెళ్లాయి.

చేసిన పని తాలూకా డబ్బులు అడిగినందుకే వివాదం తలెత్తిందని బాధితులు వాపోయారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించకపోవటం వల్లే తమ ఇళ్లపై దాడి చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని.., బాధితులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుంటామని ఆర్​.ఆర్​.పేట ఎస్​ఐ అనూష తెలిపారు. ఇరువర్గాలు గంతోలోనూ ఒకరిపై మరొకరు స్టేషన్​లో ఫిర్యాదు చేసుకున్నారని ఎస్​ఐ వెల్లడించారు.

ఇదీ చదవండి

ప్రత్తిపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.