నిబంధనలకు విరుద్ధంగా సచివాలయాల్లో ఆశా వర్కర్ల మ్యాపింగ్ కేటాయింపులో జరిగిన అవకతవకలను సరిచేయాలని అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం శూన్యమని సీఐటీయూ కృష్ణాజిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఆశ వర్కర్ల కేటాయింపు మ్యాపింగ్‌లో తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో ధర్నాకు దిగారు. కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో ఆశా వర్కర్లు ఫ్రంట్ లైన్ వారియర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. సచివాలయాలకు ఆశా వర్కర్ల కేటాయింపులో రాజకీయ జోక్యం తగదని.. కేటాయింపు పారదర్శకంగా ఉండాలన్నారు. నిలిపివేసిన వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. విశాఖ కేజీహెచ్‌లో కొవిడ్ రోగి ఆత్మహత్యాయత్నం