మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. లేదంటే జూన్ 4వ తేదీ తరువాత ఏ రోజైనా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కరోనా రెెండవ దశ తీవ్రతతో ఇప్పటికే అనేకమంది మున్సిపల్ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్, షూష్, పీపీఈ కిట్లు వంటివి అరకొరగా ఇచ్చి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ, హెల్త్ అలవెన్సుతోపాటు జీతాల బకాయిలు ఇవ్వట్లేదని..దీంతో కార్మికుల కుటుంబాలు పస్తులతో గడపాల్సి వస్తుందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి.