కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం అవనిగడ్డ డిగ్రీ కాలేజీ మైదానంలో సంక్రాంతి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా "జూదం వద్దు-సాంప్రదాయ క్రీడలు ముద్దు" అనే నినాదంతో అవనిగడ్డ సబ్ డివిజన్ పొలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డి పోటీలు నిర్వహించారు. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగా అవనిగడ్డకు విచ్చేసిన ప్రముఖ సినీ హాస్యనటుడు అలీ ఈ పోటీలను తిలకించారు. యువతతో కలిసి కబడ్డీ ఆడిన ఆలీ.. క్రీడాకారులను ఉత్తేజపరిచారు. యువత ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పోటిల్లో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు మొదటి, రెండవ నగదు బహుమతి ప్రకటించిన ఆయన... ప్రతి ఏడాది నగదు బహుమతి పంపిస్తానని తెలిపారు.
ఇదీచూడండి: