విజయవాడ పటమటలంకలోని సెయింట్ పాల్స్ కాతెడ్రల్ చర్చిలో కతోలిక పీఠాధిపతి బిషన్ తెలగతోటి జోసఫ్ రాజరావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కథోలిక క్రైస్తవ భక్తులకు ఫాదర్ సింహ రాయల.. సత్యప్రసాదం అందచేశారు. క్రీస్తు జననం తెలిపే పశువుల పాక దగ్గర భక్తులు మోకరిల్లి ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి భక్తి గీతాలు ఆలపించారు.
ఇదీ చూడండి